-ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద బాలికకు రూ.26,500 ఆర్థిక సాయం…
హుజురాబాద్/ సెప్టెంబర్ 22 (మా అక్షరం): ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాట్రపల్లి గ్రామానికి చెందిన మైస శరణ్య అనే బాలికకు రూ.26,500 ఆర్థిక సహాయం అందించారు.గత కొంతకాలంగా ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న శరణ్యకు మెరుగైన వైద్యం అందించడం నిరుపేద కుటుంబానికి భారంగా మారింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన రవాణా ఖర్చులు కూడా లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయాన్ని కాట్రపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కాసగోని కిరణ్ కుమార్ మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వర్ధినేని రవీందర్ రావు వెంటనే స్పందించి బాలిక కుటుంబ సభ్యులను గ్రూప్ సభ్యుల వద్దకు పిలిపించారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సభ్యులు చలించిపోయి విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థిక సహాయం అందించిన దాతలు
వర్ధినేని రవీందర్ రావు – రూ.5,000
నాగార్జున డైరీ ప్రభాకర్ రావు – రూ.5,000
గోలి శ్రీనివాస్ – రూ.5,000
బండ శ్రీనివాస్ – రూ.2,000
చింత శ్రీనివాస్ – రూ.1,000
పాక సతీష్ – రూ.1,000
ధనవర్ష రాజు – రూ.1,000
తక్కలపల్లి సంపత్ రావు (అవని సీడ్స్) – రూ.1,016
కళ్యాణం శ్రీనివాస్ – రూ.1,000
మల్లారెడ్డి (రాజపల్లి సర్పంచ్) – రూ.1,000
తోగరు విద్యాసాగర్ – రూ.1,000
చంద్రగిరి ప్రవీణ్ – రూ.500
రుద్రారం కుమారస్వామి – రూ.500
గోలి సురేష్ (రైస్ డిపో) – రూ.500
గంజి జవర్ధన్ – రూ.500
వేల్పుల రత్నం (రిటైర్డ్ జీహెచ్ఎం) – రూ.500
ఈ సందర్భంగా బాలిక త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ద్వారా సమాజంలో సేవాభావం, మానవత్వం మరింత పెంపొందుతాయని చాటిచెప్పారు.












