+91 99635 77856

వల్బాపూర్ లో భక్తిశ్రద్ధలతో మహిళల కుంకుమ పూజ

Kudikala Sai Editor
maaksharamnews.in

వల్బాపూర్ లో భక్తిశ్రద్ధలతో మహిళల కుంకుమ పూజ

ఎల్కతుర్తి/సెప్టెంబర్ 21 (మా అక్షరం):

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వల్బాపూర్ గ్రామంలో ఆకురాత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల కుంకుమ పూజ కార్యక్రమాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణపతి మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు అయ్యగారు పోలోజు శంకరాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలకు కుంకుమ, ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి వల్బాపూర్ గ్రామ సర్పంచ్ పోనగంటి శ్వేత శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళల కుంకుమ పూజ నిర్వహించడం ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆకురాత్ యూత్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !