+91 99635 77856

గణనాథుల నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు

Kudikala Sai Editor
maaksharamnews.in

గణనాథుల నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు

-కెనాల్‌లో నీటి విడుదలపై అధికారుల చర్చ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కార్యాచరణ...

హుజురాబాద్/ సెప్టెంబర్ 21(మా అక్షరం): గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు కసరత్తు ప్రారంభించారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అధ్యక్షతన సోమవారం మున్సిపల్, వివిధ శాఖల అధికారులు నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌లో నీరు అందుబాటులో లేకపోవడంపై చర్చించారు.నిమజ్జనానికి సరిపడా నీటిని అందుబాటులోకి తీసుకువచ్చే విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమాలోచనలు జరిపారు. కెనాల్‌లో నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఆ నీరు నిమజ్జన ప్రాంతానికి చేరుకోవడంపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవేళ కెనాల్‌లోకి నీరు చేరకపోతే ఇసుక బస్తాలతో నీటిని నిల్వ ఉంచి నిమజ్జనానికి అనుకూలమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికను పరిశీలిస్తున్నారు.నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ పరిశీలనలో ఏసీబీ మాధవితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-కెనాల్‌లో నీటి విడుదలపై అధికారుల చర్చ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కార్యాచరణ…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !