+91 99635 77856

కన్నుల పండువగా గణనాథుల శోభాయాత్రలు.. ఘనంగా నిమజ్జనం

Kudikala Sai Editor
maaksharamnews.in

కన్నుల పండువగా గణనాథుల శోభాయాత్రలు.. ఘనంగా నిమజ్జనం

-జై గణేశా.. జై జై గణేశా.. నినాదాలతో మార్మోగిన హుజురాబాద్...

-యువత నృత్యాలు.. మహిళల కోలాటాలు.. డప్పు చప్పుళ్ల మధ్య గణపయ్యకు వీడ్కోలు...

-నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని..

హుజురాబాద్/ సెప్టెంబర్ 23 (మా అక్షరం): జై గణేశా.. జై జై గణేశా.. గణపతి బప్పా మోరియా.. బై బై గణేశా.. అంటూ భక్తజనం చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులకు బుధవారం కన్నుల పండువగా నిర్వహించిన శోభాయాత్రలతో ఘనంగా వీడ్కోలు పలికారు. యువకుల ఉత్సాహభరిత నృత్యాలు, చిన్నారుల కేరింతలు, మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లు, నడుమ గణపయ్య శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. అడుగడుగునా భక్తులు గణనాథుడికి నీరాజనాలు పలుకుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ మండపాల్లో తొమ్మిది రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు అందుకున్న గౌరీ తనయుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోనూ వినాయక నిమజ్జన సందడి ప్రారంభమైంది. అలంకరించిన వాహనాలపై గణనాథుల విగ్రహాలను ఊరేగిస్తూ భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రల్లో పాల్గొన్నారు. గణపయ్యా.. మళ్లీ రావయ్యా అంటూ భక్తులు భావోద్వేగాల నడుమ స్వామివారికి వీడ్కోలు పలికారు.

నిమజ్జన సమయంలో వర్షంతో భక్తులకు ఇబ్బందులు

నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం కురవడంతో భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా పలువురు భక్తులు శోభాయాత్రల్లో పాల్గొని గణనాథులకు వీడ్కోలు పలికారు. వర్షం కారణంగా నిమజ్జన ప్రాంతాల్లో తాత్కాలికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, అధికారులు అప్రమత్తమై భక్తులకు అవసరమైన సూచనలు చేశారు.

నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ ఏర్పాట్లు

గణనాథుల నిమజ్జనం సందర్భంగా పట్టణ శివారులోని కొత్తపల్లి ఎస్సారెస్పీ కెనాల్, కాకతీయ కాలువ పరిసరాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. విగ్రహాల నిమజ్జనం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు.

తొలి నిమజ్జనాన్ని ప్రారంభించిన చైర్‌పర్సన్

కాకతీయ కాలువ వద్ద తొలి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, వివిధ శాఖల అధికారులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-జై గణేశా.. జై జై గణేశా.. నినాదాలతో మార్మోగిన హుజురాబాద్…

-యువత నృత్యాలు.. మహిళల కోలాటాలు.. డప్పు చప్పుళ్ల మధ్య గణపయ్యకు వీడ్కోలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !