+91 99635 77856

గణేష్ నిమజ్జనానికి నీటి కష్టాలు

Kudikala Sai Editor
maaksharamnews.in

గణేష్ నిమజ్జనానికి నీటి కష్టాలు

-ఎస్సారెస్పీ కాలువలో నీళ్లు లేక ఇబ్బందులు..

-ట్యాంకర్లతో నీటిని నింపుతున్న అధికారులు..

హుజురాబాద్/ సెప్టెంబర్ 22(మా అక్షరం): విఘ్నాలను తొలగించే గణనాథుడి నిమజ్జనానికి నీటి కష్టాలు ఏర్పడ్డాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు స్థానిక ఎస్సారెస్పీ కాలువలో నీరు లేకపోవడంతో నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో చేసేది లేక మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి, కాలువలోని ఒక వైపున ఇసుక బస్తాలతో అడ్డుకట్ట ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తున్నారు. గణపతి విగ్రహాల నిమజ్జనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎస్సారెస్పీ నీటి విడుదల గూర్చి అధికారులతో మాట్లాడినప్పటికీ ఇప్పటివరకు పురోగతి లేకపోవడంతో అధికారులు ట్యాంకర్లతో నీటిని నింపుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.అయితే విఘ్నాలను తొలగించే వినాయకుడికే నీటి కష్టాలు తప్పకపోవడంతో హుజురాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !