+91 99635 77856

వినాయక నిమజ్జన ఘటనలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన

Kudikala Sai Editor
maaksharamnews.in

వినాయక నిమజ్జన ఘటనలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన

-విగ్రహాలను జేసీబీలతో ముక్కలు చేయడం బాధాకరం...

-నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని విమర్శ...

హుజురాబాద్/ సెప్టెంబర్ 24 (మా అక్షరం): పట్టణంలో నిన్న జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాలను జేసీబీలతో ఒకదానిపై మరొకటి వేసి ముక్కలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఐదు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు పవిత్రంగా పూజించిన గణనాథుల విగ్రహాలకు ఇలాంటి పరిస్థితి రావడం తన మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు.వినాయక నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రులను పలుమార్లు కోరినట్లు తెలిపారు. కనీసం 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా అనే విషయాన్ని హుజురాబాద్ ప్రజలు ఆలోచించాలని అన్నారు.హుజురాబాద్‌లో నిన్న జరిగిన నిమజ్జన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న విమర్శ కాదని, వినాయక భక్తుల మనోభావాలకు జరిగిన అవమానంపై వ్యక్తం చేస్తున్న ఆవేదన అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-విగ్రహాలను జేసీబీలతో ముక్కలు చేయడం బాధాకరం…

-నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని విమర్శ…

హుజురాబాద్/ సెప్టెంబర్ 24 (మా అక్షరం): పట్టణంలో నిన్న జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాలను జేసీబీలతో ఒకదానిపై మరొకటి వేసి ముక్కలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఐదు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు పవిత్రంగా పూజించిన గణనాథుల విగ్రహాలకు ఇలాంటి పరిస్థితి రావడం తన మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు.వినాయక నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రులను పలుమార్లు కోరినట్లు తెలిపారు. కనీసం 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా అనే విషయాన్ని హుజురాబాద్ ప్రజలు ఆలోచించాలని అన్నారు.హుజురాబాద్‌లో నిన్న జరిగిన నిమజ్జన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న విమర్శ కాదని, వినాయక భక్తుల మనోభావాలకు జరిగిన అవమానంపై వ్యక్తం చేస్తున్న ఆవేదన అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !