+91 99635 77856

కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలు

-ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి సమాజ... నాయకులు.. బాపూజీ ఆశయాల సాధనకు పిలుపు...

హుజురాబాద్/ సెప్టెంబర్ 21(మా అక్షరం): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను సోమవారం పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్‌రోడ్ వద్ద ఉన్న బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి బాపూజీ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన సొంత ఇంటిని సైతం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన మహనీయుడని పేర్కొన్నారు.ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడిన బాపూజీ, ఆనాటి నిరంకుశ నవాబుల పాలనను సైతం ఎదిరించి ప్రజల హక్కుల కోసం పోరాటం సాగించారని తెలిపారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొంటూ, బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ నాయకులువేముల యాదగిరి,ఎలిగేటి ఉపేందర్‌, సంగెం ఐలయ్య, చందుపట్ల జనార్ధన్, సబ్బని రాజేందర్,విడపు రాజు,మంచికట్ల వెంకటరాజం, చిలుకమారి శ్రీనివాస్,మార్తా రవీందర్, మచ్చికట్ల కమలాకర్, మండల యాదగిరి, కుడికాల సాయి,ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఆడెపు సూర్యం, సంగెం సత్యనారాయణ, సంగెం భాస్కర్, సంగెం శ్రీధర్, గాలి సమ్మయ్య, మంద బిక్షపతి, కొండా గణేష్, సంగెం శ్రీనివాస్ (చిక్స్), సంగెం శ్రీనివాస్ (మెడికల్), నల్గొండ కుమార్, వేముల రమేష్ తో పాటు అధిక సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి సమాజ… నాయకులు.. బాపూజీ ఆశయాల సాధనకు పిలుపు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !