ఆకురాత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కోలాటం
ఎల్కతుర్తి /సెప్టెంబరు 20 (మా అక్షరం):
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వల్బాపూర్ గ్రామంలో ఆదివారం కోలాటం కార్యక్రమం సందడిగా జరిగింది. ఆకురాత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గణపతి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంప్రదాయ కోలాట ప్రదర్శన నిర్వహించారు. రంగురంగుల దుస్తులు ధరించిన పలువురు కోలాట బృంద సభ్యులు లయబద్ధంగా కోలాటం ఆడుతూ సందడి చేశారు. కోలాట పాటలు, వాయిద్యాల నడుమ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోలాట కార్యక్రమాన్ని వీక్షించారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు యువతలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆకురాత్ యూత్ అసోసియేషన్ సభ్యులు దగ్గు వెంకటేష్ , దగ్గు చందు, కొండ అభిలాష్ గౌడ్, పోలినేని నిఖిల్, పెండ్యాల గణేష్, పంచనేని ప్రశాంత్ రావు, చిర్ర ప్రజ్ఞాన్ గౌడ్, పంచనేని సుశాంత్ రావు, పోలినేని దీపక్ పోలినేని రోహిత్, దగ్గు లోహిత్, దగ్గు కుశల్, చిర్ర అక్షయ్ కుమార్, న్యాయలం అభిలాష్ మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు గ్రామీణ సంప్రదాయాలను కాపాడేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కోలాట కార్యక్రమం విజయవంతం కావడంతో గ్రామస్థులు నిర్వాహకులను అభినందించారు.













