+91 99635 77856

ఆదివాసి ఎరుకల తెగను పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం

-గిరిజనులు అంటే కోయ లంబాడి గోండు తెగలేనా..!?
-తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకినీ రాజు
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: ఆదివాసి ఎరుకల తెగను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఇటీవల జరిగిన అసెంబ్లీ లో ఆదివాసి ఎరుకల గురించి ఎందుకు మాట్లాడలేదు బహిరంగ ప్రకటన చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకినీ రాజు డిమాండ్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అంటే ఆదివాసులు మాత్రమే కాదు అని ఆదివాసి తెగల ఎస్టి అని ఇతర తెగలతో పోల్చుకుంటే ఆదివాసి ఎరుకల తెగ జీవితాలు బ్రతుకులు దుర్భరంగా మారిపోతున్నాయన్నారు. రాజ్యాంగం అవలంబించినప్పటినుండి నేటి వరకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికారులు కేవలం గిరిజనులు అంటే లంబాడి కోయ గోల్డ్ తెగలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారు అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఇది ఎంతవరకు సమన్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ పార్టీలు తెలంగాణ సమాజానికి ముఖ్యంగా ఆదివాసి గిరిజన సమాజానికి ఆదివాసి ఎరుకల తెగ ఒకటి ఉన్నదన్నది మర్చిపోవడం చాలా బాధాకరమన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు గిరిజనుల పేరుతో నాలుగైదు కులాలకు మాత్రమే అధిక నిధులు ఖర్చు చేస్తూ ఆదివాసి ఎరుకల తెగ జీవితాలకు ఏమాత్రం ఖర్చు చేయడం లేదని అందులో ఆదివాసి ఎరుకల తీగ కు ఇప్పటివరకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అసలు ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదు అర్థం కావడం లేదన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసి గిరిజనులను మాత్రమే గుర్తుంచుకొని… ఆదివాసి ఎరుకల తెగను మరిచిపోయారని అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఆలోచన సరళిని మార్చుకొని ఎస్టీ కార్పొరేషన్ కు ప్రకటించిన నిధులతో తెలంగాణ ఎరుకల జాతిని ఆదుకోవాలని ఆయన కోరారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరుకల జాతి జీవితాలను బాగుపరిచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి పలు రకాలుగా ఆదుకున్నారని, దళిత బంధు కూడా వర్తింపజేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !