-దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి
-హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:మూడో వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని కోరారు.రవీందర్ దాడిలో గాయపడిన బిఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికార పార్టీ అనే అహంతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్నారని అక్కడికి వెళ్లి అడిగిన వారిని దుర్భాషలాడుతూ రాడ్ తో దాడికి పాల్పడ్డారని అన్నారు. ధర్మారం శివారులోని 42 సర్వేనెంబర్ అది ప్రభుత్వ భూమి అని గతంలో ఆపిన దానిని తిరిగి కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఆపడానికి వెళ్ళిన వారిపై దాడికి పాల్పడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. మంత్రి అండదండలు ఉన్నాయని, రవీందర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలను తీర్చమని తప్ప రౌడీయిజం కోసం కాదన్నారు.












