– నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వన దేవతలే స్ఫూర్తి
– ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగిస్తున్నాం
– బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని, నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్కల స్ఫూర్తితోనే నిరంకుశ పాలనను అంతం చేశామని బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.

శుక్రవారం నియోజకవర్గంలోని వీణవంక, జూపాక సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వోడితల ప్రణవ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని, కూలి పోతుందని మాట్లాడే వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. వంద రోజుల పరిపాలన కూడా పూర్తి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే ముందు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చరో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి నుండి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 అందజేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. సమ్మక్క-సారలమ్మ ల ఆశీస్సులతో, ప్రజల భాగస్వామ్యంతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సమ్మక్క -సారక్క చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.












