+91 99635 77856

ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి

వన దేవతలను స్ఫూర్తిగా తీసుకోవాలి

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రణాళిక బోర్డు సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లు అన్నారు.

శుక్రవారం హుజరాబాద్ లోని రంగనాయకుల గుట్ట వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతరలో ఆయన మాట్లాడారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలు వీరనారిమణులని వారిని ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సుపరిపాలన చేసి ప్రజలకు అన్ని విధాల సహకారాలు అందించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలంతా సమ్మక్క సార్లమ్మ జాతరను కుటుంబ సభ్యులతో సంతోషంగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, రమాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !