+91 99635 77856

అభివృద్ధి అంటేనే కాంగ్రెస్..

-కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్:కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత అన్నారు. మంగళవారం ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడం పట్ల స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను భాగంగా గృహలక్ష్మి, గృహ జ్యోతిలను అమలు చేస్తుందని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వారి వ్యాఖ్యలకు చెంపపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, సొల్లు సునిత, మల్లీశ్వరి, కడారి తిరుమల, లక్ష్మి, రాధ, కరీమా, మంజులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొల్లు బాబు, యస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్ర రవీందర్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, యస్సి సెల్ జిల్లా మాజీ కార్యదర్శి ఏర్ర రమేష్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, సమ్మెట సంపత్, కుడికాల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !