+91 99635 77856

ఉద్యోగుల సహకారంతోనే ఎక్సలెన్సీ అవార్డు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఉద్యోగుల సహకారంతోనే ఎక్సలెన్సీ అవార్డు

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: నాగార్జున డైరీ లో పనిచేస్తున్న ఉద్యోగుల అందరి సహకారంతోనే ఎక్సలెన్సీ 2024 అవార్డు వచ్చిందని నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు అన్నారు.

శనివారం హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్ వద్ద గల నాగార్జున డైరీలో అవార్డు ప్రధానం సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గత 20 ఏళ్లుగా డైరీ ప్రజలకు నిష్పక్షపాతంగా నిజాయితీతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది అన్నారు. డైరీ నాణ్యత విషయంలో రాజి లేకుండా పనిచేస్తుందని అన్నారు. ప్రజల సహకారంతో మున్ముందు మరిన్ని సేవలందిస్తామని అన్నారు. అవార్డు రావడంలో డైరీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి శ్రమ దాగి ఉందని అన్నారు. దీంతోపాటు నాణ్యమైన పాలు ప్రజలకు అందించడానికి ఎప్పుడూ నాగర్జున డైరీ ముందుంటుందన్నారు. అలాగే పాల నాణ్యతను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మైక్రో బయాలజీ ల్యాబ్ ను కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ అధినేత ప్రభాకర్ సతీమణి అహల్య, నాగార్జున డైరీ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు లతో పాటు నాగార్జున డైరీ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: నాగార్జున డైరీ లో పనిచేస్తున్న ఉద్యోగుల అందరి సహకారంతోనే ఎక్సలెన్సీ 2024 అవార్డు వచ్చిందని నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు అన్నారు.

శనివారం హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్ వద్ద గల నాగార్జున డైరీలో అవార్డు ప్రధానం సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా డైరీ ప్రజలకు నిష్పక్షపాతంగా నిజాయితీతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది అన్నారు. డైరీ నాణ్యత విషయంలో రాజి లేకుండా పనిచేస్తుందని అన్నారు. ప్రజల సహకారంతో మున్ముందు మరిన్ని సేవలందిస్తామని అన్నారు. అవార్డు రావడంలో డైరీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి శ్రమ దాగి ఉందని అన్నారు. దీంతోపాటు నాణ్యమైన పాలు ప్రజలకు అందించడానికి ఎప్పుడూ నాగర్జున డైరీ ముందుంటుందన్నారు. అలాగే పాల నాణ్యతను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మైక్రో బయాలజీ ల్యాబ్ ను కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ అధినేత ప్రభాకర్ సతీమణి అహల్య, నాగార్జున డైరీ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు లతో పాటు నాగార్జున డైరీ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !