+91 99635 77856

నా జీవితం కరీంనగర్ ప్రజలకు అంకితం

కరీంనగర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు..
-కరీంనగర్ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ..
-కరీంనగర్ నుండి భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటండి..
-జమ్మికుంట ప్రజా యాత్ర సభలో బండి సంజయ్
కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: జిమ్మికుంటలో అడుగుపెట్టగానే కేంద్రం కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని కరీంనగర్ ఎంపీ,బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు.

శనివారం ప్రజాయాత్రలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు తలెత్తుకునేలా పనులు చేస్తానని,కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేస్తారని,కరీంనగర్ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీలను కాకి ఎత్తుకుపోయే రోజులు వస్తున్నాయని, ఎన్నికల సాకుతో హామీల అమలుపై కాంగ్రెస్ దాటవేయబోతున్నారన్నారు. బిజెపి గెలిస్తే మోడీ ప్రధాని అవుతారని… కానీ కాంగ్రెస్ గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారని… చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పై ఎందుకు కొట్లాడటం లేదన్నారు. కాలేశ్వరంలో లక్ష కోట్లు దుర్వినియోగం చేసిన కేసీఆర్ ను ఎందుకు బొక్కలో వేయడం లేదన్నారు.దళిత బంధు కోసం 4900 మంది దరఖాస్తు చేసుకుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని దళిత బందు వచ్చేంతవరకు పోరాడుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !