+91 99635 77856

కండిషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో కోత పెడుతున్నారు

వెయ్యి మందిని పెండ్లికి పిలిచి 10 మందికి అన్నం పెడతానంటే ఎలా?
-ఎన్నికల హమీలన్నీ అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలి
-ఎక్కడి నుండి నిధులు తీసుకొస్తారో సమాధానం చెప్పాలి?
-మోదీలేని భారత్ ను ఊహించుకోలేం
-పోరాటాలు మావి… అధికారం కాంగ్రెస్ దక్కించుకుంది
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తుందని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

ఆదివారం ప్రజాయాత్రలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన పార్టీ అని, లక్షలాది కుటుంబాలు గత పదేండ్లు ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ తీరును చూస్తుంటే వెయ్యి మందిని పెండ్లికి పిలిచి అందులో 10 మందికి మాత్రమే అరిటాకులో అన్నం పెట్టినట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఉందని,అప్పుల్లో ఉన్న తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షలు కోట్లు అవసరమని,ఆ నిధులు ఎక్కడి నుండి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నరేంద్రమోదీ లేని భారత్ ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు.మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిధ్ధమయ్యారన్నారు. నన్ను రెండోసారి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, జేపి నడ్డా కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, నాపై విశ్వాసంతో టికెట్ ఇచ్చిన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ప్రధానిని ఒప్పించి అధిక నిధులు తీసుకొచ్చి తెలంగాణలో అభివృద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తానని…దేశమంతా మోదీ గాలి వీస్తుందని, నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేస్తామని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా వేమలవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించానని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీయే కాదన్నారు.గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, మండల అధ్యక్షుడు రాముల కుమార్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !