+91 99635 77856

ప్రవీణ్ కి నివాళులు అర్పించిన బిజెపి జిల్లా శాఖ..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రవీణ్ కి నివాళులు అర్పించిన బిజెపి జిల్లా శాఖ..

-ప్రవీణ్ నిబద్ధత గల బిజెపి నాయకుడు,.. మృతి తీరని లోటు...
-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్. బీజేపీ కరీంనగర్ జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్ అకాల మృతి పట్ల జిల్లా శాఖ సంతాపం వ్యక్తం చేసి, ఘన నివాళులు అర్పించింది. మంగళవారం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హుజురాబాద్ పట్టణంలోని ప్రవీణ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం పై పార్టీ పతాకాన్ని కప్పడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ... క్రమశిక్షణ,నియమ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కోసమే ప్రవీణ్ నిరంతరం కృషి చేశారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఇటీవల గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రవీణ్,అకాల మరణం చెందడం చాలా విచారకరమన్నారు. జిల్లా పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని,వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధర్యాన్ని ప్రసాదించాలని,ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,మండల అధ్యక్షులు రాముల కుమార్, నల్ల సుమన్,గంగిశెట్టి ప్రభాకర్,వేణు,తుర్పాటి రాజు, యాంసాని శశిధర్,వినయ్, చైతన్య రాజశేఖర్, నగేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

ప్రవీణ్ నిబద్ధత గల బిజెపి నాయకుడు,.. మృతి తీరని లోటు…
-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్. బీజేపీ కరీంనగర్ జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్ అకాల మృతి పట్ల జిల్లా శాఖ సంతాపం వ్యక్తం చేసి, ఘన నివాళులు అర్పించింది. మంగళవారం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హుజురాబాద్ పట్టణంలోని ప్రవీణ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం పై పార్టీ పతాకాన్ని కప్పడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… క్రమశిక్షణ,నియమ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కోసమే ప్రవీణ్ నిరంతరం కృషి చేశారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఇటీవల గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రవీణ్,అకాల మరణం చెందడం చాలా విచారకరమన్నారు. జిల్లా పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని,వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధర్యాన్ని ప్రసాదించాలని,ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,మండల అధ్యక్షులు రాముల కుమార్, నల్ల సుమన్,గంగిశెట్టి ప్రభాకర్,వేణు,తుర్పాటి రాజు, యాంసాని శశిధర్,వినయ్, చైతన్య రాజశేఖర్, నగేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !