+91 99635 77856

మహిళా సాధికారత, స్వావలంబన దార్శనికతను నెరవేర్చడానికే “శక్తి వందన్ అభియాన్

శక్తి వందన్ అభియాన్ ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి….
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఊహించిన మహిళా సాధికారత, స్వావలంబన దార్శనికత ను నెరవేర్చడానికి శక్తి వందన్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.శక్తి వందన్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వి వో, సి ఆర్ పి,స్వయం సహాయక బృందాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా గ్రూపు సభ్యులతో హుజురాబాద్ లో జరిగిన ప్రోగ్రాంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్రంలోని బిజెపి మోదీ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అనేక విషయాలలో ప్రభుత్వం విజయం సాధించింది అన్నారు. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత మోడీ ప్రభుత్వం దేనినన్నారు.మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను,విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రచారంలో చురుగ్గా పాల్గొనడానికి శక్తి వందన్ అభియాన్ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రోగ్రాం లో భాగంగా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలను మహిళా మోర్చా ప్రతినిధులు విస్తృతంగా ప్రజలను కలిసే కసరత్తును చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమం లో సి ఎల్ ఆర్ పి లు, ఆర్ పి లు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,మండల అధ్యక్షులు రాముల కుమార్,కౌన్సిలర్ నల్ల సుమన్,వివిధ మండల అద్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు జిడి మల్లేష్, తిరుపతి రెడ్డి,అశోక్ రెడ్డి,భూపతి ప్రవీణ్,గంగిశెట్టి ప్రభాకర్,మహిళ సంఘాల సభ్యులు నియోజకవర్గ మండల మహిళ మొర్ఛ నాయకురాలు, రాణి రెడ్డి, రమ,లక్ష్మి, మౌనిక,లావణ్య,స్వాతిరెడ్డి,కవిత అనిత,మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !