+91 99635 77856

నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే దిగిపో.. కేసీఆర్ వచ్చి ఇస్తాడు..

కరీంనగర్ లో ఎంపీగా వినోద్ కుమార్ గెలుపు తథ్యం
-అధికారం శాశ్వతం కాదు తస్మాత్ జాగ్రత్త
-అబద్ధం చెప్పే బండి సంజయ్ కావాలా?నిజాయితీగా ఉండే వినోద్ కుమార్ కావాలో తేల్చుకోండి…
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణను సాధించుకుంది కూడా కరీంనగర్ నుంచే అని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించింది కూడా కెసిఆర్ అని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా మొట్టమొదటి పార్లమెంటు సీటును కూడా కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ దేనని అన్నారు. కెసిఆర్ కి కార్యకర్తల మీద అపారమైన నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 కు 17 సీట్లు బిఆర్ఎస్ సాధించేలా కార్యకర్తలు పని చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కెసిఆర్, కేటీఆర్ లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తప్పా రైతులకు నీళ్లు అందించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా రైతుల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించలేక పోతే ఆ పదవికి రాజీనామా చేయాలని అదే స్థానంలో మరోసారి కెసిఆర్ ను నిలబెడితే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఆయన అన్నారు. కెసిఆర్ పరిపాలనలో 10 సంవత్సరాలు రైతులకు నీళ్లు ఎలా వచ్చాయని ఇప్పుడు ఎందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండు నెలలు కాకముందే లోకల్ లీడర్లు విర్రవీగుతున్నారని వారికి కళ్లెం వేయాలంటే కరీంనగర్ లో వినోద్ కుమార్ ను గెలిపించాలని అన్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బిఆర్ఎస్ నాయకుల పైన కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని అధికారం ఏ ఒక్క పార్టీకి శాశ్వతం కాదని మళ్లీ సమయం మాకు కూడా వస్తుందని అన్నారు.వినోద్ కుమార్ చాలా గొప్ప నాయకుడని అసలు అబద్ధం ఆడే వ్యక్తి కాదని ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే కరీంనగర్ పార్లమెంటులో నిధుల కోసం కొట్లాడుతారని అన్నారు.పూటకో అబద్ధం చెప్పే బండి సంజయ్ కావాలా లేక నిజాయితీపరుడైన వినోద్ కుమార్ కావాలో తెలుసుకోవాలని అన్నారు.సర్వే రిపోర్ట్ లన్ని బి ఆర్ ఎస్ కు అనుగుణంగా ఉన్నాయని వినోద్ కుమార్ కు 12 శాతం ఓట్లు అధికంగా వస్తున్నాయని అన్నారు. వినోద్ కుమార్ ను పక్క గెలిపించుకుంటున్నామని కాంగ్రెస్ పార్లమెంట్ పై బిఆర్ఎస్ జెండా ఎగరవేయబోతున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !