+91 99635 77856

కెసిఆర్ సభను విజయవంతం చేయండి

Kudikala Sai Editor
maaksharamnews.in

కెసిఆర్ సభను విజయవంతం చేయండి

-టిఆర్ఎస్ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి..
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: ఈనెల 12న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కథన బేరి సభను నిర్వహించడం జరుగుతుందని పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు అనే పద్యంలో మొట్టమొదటి భారీ బహిరంగ సభను కరీంనగర్ సెంటిమెంట్ గా భావించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే కథనభేరి సభకు హుజురాబాద్ నియోజకవర్గం నుండి జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలిరావాలన్నారు.ఆరో గ్యారెంటీల పథకం పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రలోభాలకు గురిచేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడవ గ్యారంటీ అయిన కరువును కూడా వెంట తెచ్చిందని ఎద్దేవ చేశారు.రైతులు ప్రజలు తాగునీరు,సాగునీరు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు.పైగా ఎండాకాలం పంటపూటకు వస్తుంది.దీనికి తోడు కరెంటు కోతలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారం చేపట్టి 95 రోజులు గడిచిన కనీసం మూడు పథకాలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ వాణి, బాణీ వినిపించడం జరుగుతుందని,రాష్ట్ర ప్రజల కష్టనష్టాలను దేశవ్యాప్తంగా తెలియజేయాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి 17 కి17 ఎంపీ సీట్లు గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కావున ఈనెల 12న కరీంనగర్ లో నిర్వహించే కెసిఆర్ కథన బేరి సభను ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంత చేయగలరని పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

టిఆర్ఎస్ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !