+91 99635 77856

ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించాలి..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించాలి..

ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సిరిపాటి వేణు.
కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మెనిఫెస్టోలో మూడు రిజర్వేషన్లు ప్రకటించిందని, మంత్రి వర్గ సమావేశంలో మాదిగ వర్గానికి ఒకటి,మాలల వర్గానికి ఒకటి ప్రకటించి ఎలక్షన్కు ముందు మూడు ప్రకటించి నిన్న కేవలం రెండు కార్పోరేషన్లు ప్రకటించడం సరికాదని ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సిరిపాటి వేణు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో కలసి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఉన్న ఎస్సీ 57 ఉపకులాలకు పోరాట సమితి జాతీయ అధ్యక్షుడైన బైరి వెంకటేశంను ఉపకులాల కార్పొరేషన్ ను చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మాట,ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడితే సహించేది లేదన్నారు.ఉప కులాలను మాల మాదిగల కింద తోసేయడాన్ని వేణు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే తమ తప్పుడు నిర్ణయాన్ని మార్చుకొని ఉప కులాలకు ప్రత్యేక కార్పోరేషన్ ను ప్రకటించని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాల తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ 57 ఉపకులాల వారి కుటుంబాల సంఖ్య దాదాపు 6వేలకు పైగా ఉందని,హుజురాబాద్ నియోజవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 3500 ప్రకటించగా దానిలో మా ఎస్సీ ఉపకులాల వారికి 1500 ఇండ్లు కేటాయించాల్సిందిగా వేణు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గడ్డం సమ్మయ్య,డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య,నాయకులు చింతల అంజి,వానరాశి జాన్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

  • ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సిరిపాటి వేణు.
    కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మెనిఫెస్టోలో మూడు రిజర్వేషన్లు ప్రకటించిందని, మంత్రి వర్గ సమావేశంలో మాదిగ వర్గానికి ఒకటి,మాలల వర్గానికి ఒకటి ప్రకటించి ఎలక్షన్కు ముందు మూడు ప్రకటించి నిన్న కేవలం రెండు కార్పోరేషన్లు ప్రకటించడం సరికాదని ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సిరిపాటి వేణు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో కలసి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఉన్న ఎస్సీ 57 ఉపకులాలకు పోరాట సమితి జాతీయ అధ్యక్షుడైన బైరి వెంకటేశంను ఉపకులాల కార్పొరేషన్ ను చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మాట,ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడితే సహించేది లేదన్నారు.ఉప కులాలను మాల మాదిగల కింద తోసేయడాన్ని వేణు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే తమ తప్పుడు నిర్ణయాన్ని మార్చుకొని ఉప కులాలకు ప్రత్యేక కార్పోరేషన్ ను ప్రకటించని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాల తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ 57 ఉపకులాల వారి కుటుంబాల సంఖ్య దాదాపు 6వేలకు పైగా ఉందని,హుజురాబాద్ నియోజవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 3500 ప్రకటించగా దానిలో మా ఎస్సీ ఉపకులాల వారికి 1500 ఇండ్లు కేటాయించాల్సిందిగా వేణు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గడ్డం సమ్మయ్య,డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య,నాయకులు చింతల అంజి,వానరాశి జాన్ తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !