+91 99635 77856

పండుగ అని వస్తే … పట్టుకెళ్లావా తండ్రి….

అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డను నాకు

దూరం చేసావా…
– నాన్న లేకున్నా ఏ కష్టమో తెలియనీయలే…
– ఏ దేవునికి ఏ పాపం చేశాను… నాకు కడుపు కోత మిగిల్చావు…
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్ : ఏ దేవునికి ఏ పాపం చేశాను…. నాకు కడుపుకోత మిగిల్చారు… పండగ చేసుకుందామని వస్తే ఉన్న ఒక్కగానొక కూతుర్ని నాకు దూరం చేశావు… ఓ దేవుడా నీకే మనసుంటే నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వు… అల్లారుముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నాకు దూరం చేసి ఎం ముల్లె కట్టుకున్నావు అంటూ ఆ తల్లి చేసే ఆర్తనాదాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. నాన్న లేకపోయినా ఐదేళ్లుగా ఎలాంటి బాధ తెలియకుండా అన్ని తానై సాకుతున్న తల్లికి టిప్పర్ రూపంలో ఆ తల్లికి బిడ్డను దూరం చేయడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటుతున్నాయి. నేనేం పాపం చేశాను..

ఐదేళ్ల క్రితం నా భర్తను… ఇప్పుడు ఉన్న కూతుర్ని తీసుకెళ్లావ్ అంటూ ఆ తల్లి విలపిస్తున్న తీరును చూసి కంటతడి పెట్టని వారంటూ లేరు. బోర్నపల్లికి చెందిన గంట శ్రీకాంత్ కవితలకు కుమార్తె సింధుజ, రుత్విక్ ఉన్నారు. ఈ కుటుంబంలో ఐదు సంవత్సరాలు క్రితం శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కవిత పిల్లలతో కలిసి భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ లోని తన పుట్టింటిలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తుంది. స్వగ్రామం బోర్నపల్లిలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు కుమార్తె, కొడుకుతో కలిసి వచ్చింది. ఉత్సవాల్లో రెండు కుటుంబాల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం ఊరంతా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విజయ్ కుమార్ తన చెల్లెలు వర్ష వరసకు అక్క అయిన సింధుజ ను తీసుకొని ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు. గ్రామంలోని బొడ్రాయి సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగం ఎక్కువగా ఉండడంతో వీరి వాహనాన్ని పక్కకు ఆపారు. ఆ టిప్పర్ అదుపుతప్పి ఆగి ఉన్న ముగ్గురు పై బోల్తా పడగా వారు మట్టిలో కూరుకుపోయారు. చుట్టుపక్కల వారు వెంటనే జెసిబి తో మట్టిని తొలగించారు. అప్పటికే విజయ్ కుమార్ సింధుజ లు మృతి చెందారు. వర్ష కొద్దిగా కదులుతున్నట్లు గమనించిన గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !