హుజురాబాద్ఏప్రిల్08(మాఅక్షరం):నియోజకవర్గఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణం లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ, ఇందిరా గాంధీ కాలము నుండి నేటి రాహుల్ గాంధీ వరకు అధిక జనాభా కలిగిన మాదిగలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దేశ ప్రధానులను ముఖ్యమంత్రులను చేయడానికి ముఖ్య భూమిక పోషించారు. కానీ నేడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మరియు కంటోన్మెంటు ఎస్సీ రిజర్వుడు ఉపఎన్నిక టికెట్లను మొత్తం నాలుగు సీట్లు మాలలకే కేటాయించి 70 లక్షల జనాభా కలిగిన మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసి సామాజిక న్యాయానికి పాతర వేశారని మండిపడ్డారు, దీనివల్ల తెలంగాణలో రాజకీయంగా మాదిగలను ఎదగనీయకుండా కుట్ర జరుగుతుందని ఆరోపించారు.కావున వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగలు కాంగ్రెస్ పార్టీని తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకొని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మారేపల్లి శ్రీనివాస్,ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి తుంగ ఆంజనేయులు,ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల మదునయ్య, సీనియర్ నాయకులు కలవల మల్లయ్య, మొలుగూరి ప్రభాకర్,ఇల్లంతకుంట ఎంఎస్పి మండల అధ్యక్షుడు మేకల యాదగిరి, గాజుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.











