– నరేంద్ర మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా..
– తాను ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి అనేక అభివృద్ధి చేశాను.. ఇప్పుడున్న ఎంపీ ఏం అభివృద్ధి చేశారు..
-రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్..
హుజురాబాద్/ఏప్రిల్18(మాఅక్షరం): రాముని ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, బండి సంజయ్ ఇల్లంతకుంట రామాలయానికి ఏం అభివృద్ధి చేశారని అన్నారు. గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటస్థాయి గార్డెన్లో ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి… ఏమాత్రం అభివృద్ధి చేశారని అన్నారు… నేను ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నానని జమ్మికుంట బ్రిడ్జి, జగిత్యాల రోడ్డు, జిల్లాలో పాస్ పోర్ట్ ఆఫీసు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన బండి సంజయ్ ఆ గ్రామంలో ఒక పని అయినా చేశారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏం పని చేయలేదు… ఊళ్ళల్లో కూడా ఏం పని చేయలేదు.. రాష్ట్రానికి కూడా ఏం పని చేయకపోతే ఓట్లు అడిగే హక్కు బిజెపికి ఎక్కడిది అని అన్నారు. మీరు మీ బూతులలో మెజారిటీ తెచ్చుకోవాలని, మెజార్టీ తెచ్చుకున్న వారికే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చామని, 500 కి గ్యాస్ అందిస్తున్నామని, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఇంద్రమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడానికి సున్నా వడ్డీ పథకాలను ప్రారంభించామన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చామన్నారు. వచ్చే వర్షాకాలపు పంటకు రైతులకు వారికి 500 బోనస్ ఇస్తామన్నారు. నల్లధనం తెచ్చి 15 లక్షలు మీ ఖాతాల్లో వేస్తామన్నారు కదా వేశారా… రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని అమలు చేస్తామన్నారు.రాహుల్ గాంధీ నఫరత్ చోడో… మొహబ్బత్ జోడో అనే నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారన్నారు. ప్రజాస్వామ్యవాది రాహుల్ గాంధీ… ఓ అప్రజాస్వామిక వాది ..ఓ నియంత మోడీ కి జరుగుతున్న పోరాటం అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పురుమళ్ళ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











