+91 99635 77856

బీసీలరా బిజెపిని ఓడిద్దాం…

హుజురాబాద్/ ఏప్రిల్ 30(మాఅక్షరం): ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనను సాగిస్తున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలని యావత్ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ రాజకీయ పోరాట సమితి అసెంబ్లీ అధ్యక్షులు చిలుకమరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు పంజల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత పది ఏళ్ల బిజెపి పాలనలో కాషాయీకరణ పేరుతో కసాయి పాలన సాగిస్తూ పేద వర్గాలను, మహిళలను, యువతను అనేక కోణాలలో అరాచకాలకు గురిచేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ప్రజాస్వామ్య శత్రుముకలను ఓడించాలని, లేని పరిస్థితుల్లో ఈ దేశము అధోగతి పాలు కావడం ఖాయమని ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి, మానవ హక్కులు పౌర స్వేచ్ఛ లేని దేశాన్ని తయారు చేయాలని బిజెపి – ఆర్ఎస్ఎస్ మూకలు పథకాలు రచిస్తున్నాయని గురు గోవర్కర్ ఆలోచనల అనుసారంగా పేదవారిని ముఖ్యంగా బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అనుచివేయడం, దేశంలో ఆర్థిక కరువును తీసుకురావడం, దేశంలో శాంతి స్వేచ్ఛలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించడం, మహిళలపై మానభంగాలను సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తద్వారా అయోమయపు సమాజంలో దేశాన్ని నిలబెట్టడం వారి లక్ష్యమని అందుకోసమే ఆర్ఎస్ఎస్ బిజెపి మూకలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ పది ఏళ్ల మోడీ పాలనలో ఓబీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగిందని 10లక్షల కోట్ల రూపాయలను గుజరాతిలకు దోచి పెట్టిన మోడీ సర్కార్ ఈ దేశంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రతి ఏటా బడ్జెట్లో బిస్కెట్లు కొనేంత కూడా నిధులు కేటాయించలేదని, కనీసం కేంద్ర బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయకుండా బీసీలను నిర్లక్ష్యంగా చూశారని, కేంద్ర బీసీ కమిషన్ కూడా అధికారాలు లేకుండా చేశారని,విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలను మోసం చేస్తూ ఉన్నత విద్య చదువుకుంటున్న బిసి యూనివర్సిటీ స్కాలర్స్ కు స్టడీ ఫండ్ ను రద్దుచేసిన మూర్ఖత్వపు పాలన చేశారని, బీసీలకు విద్యారంగంలో ఉన్నత స్థానం వస్తుందని కుట్రతో బీసీలు చదువుకోవద్దని తప్పుదోవ పట్టించడానికి నూతన విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చి అసలైన విద్యా హక్కును పౌరులకు దూరం చేసిందని, బీసీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కావాలని అనేక పోరాటాలు జరుగుతున్న ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇవ్వకుండా అర్హత నైపుణ్యత కలిగిన బీసీ ఉద్యోగులకు నష్టం చేశారని,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి బీసీ కార్మిక రంగాన్ని రోడ్డు పాలు చేశారని,కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు స్థానం లేకుండా చేశారని, న్యాయవ్యవస్థలో, సివిల్ సర్వీసెస్లో బీసీ కులాలకు నష్టం చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్దని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న పోరాటాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్, మహిళా బిల్లు లాంటివి చేసి వాటి ద్వారా పెత్తందారులకు అధికారాలను కట్టబట్టే కుట్ర చేసిందని, ఎన్ఆర్సి, సిఏఏ ద్వారా పేద ప్రజల పౌరసత్వాన్ని రద్దుచేసి కుట్ర చేసిందని, దేశవ్యాప్త ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ గణన ఎక్కడ చేయాల్సి వస్తుందో అనే భయంతో కనీసం 2021 జనాభా లెక్కలను కూడా చేయకుండా బీసీల భాదలను పేడ చెవిలో పెట్టిన ఈ పాసవీక పాలనను బొందబెట్టాలని, అద్వానీ, వాజ్పేయి లాంటి వారికి భారతరత్న ఇచ్చారు కానీ ఈ దేశంలో విద్యావ్యాప్తికి కృషిచేసిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతులకు భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచారని, బీసీలను అనేక కోణాలలో అరాచకాలకు గురిచేస్తూ పాసవిక పాలన కొనసాగిస్తున్న బీసీ వ్యతిరేక బీజేపీ ప్రభుత్వన్ని కూలదోయాలని కోరారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గత ఐదేళ్లుగా కరీంనగర్ ప్రజలకు కనిపించకుండా పోయి, ఒక్క పైసా కూడా అభివృద్ధి పని చేయకుండా, తాను ఎంపీ ని అనే విషయమే మరిచిపోయి తిరిగి ఇప్పుడు మళ్లీ పదవి కోసం వస్తున్న బండి సంజయ్ కరీంనగర్ ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు.యువతకు అండగా ఉంటానని మాట ఇచ్చిన బండి సంజయ్ యువత కోసం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం చేశారని నిలదీశారు, కనీసం తన వెంబడి తిరిగిన వారికి కూడా న్యాయం చేయని స్వార్ధపరుడు బండి సంజయ్ అని, తానే గొప్ప హిందూ భక్తులుగా చెప్పుకునే ఆయన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఇల్లంతకుంట రామాలయం, గట్టుదుద్దనపల్లి అంజన్న, కొత్తగట్టు మచ్చగిరింద్ర స్వామి లాంటి ప్రసిద్ధ దేవాలయాలు కరీంనగర్లో ఆలయాల అభివృద్ధికి ఒక్క పైస నిధులను తెచ్చిన తెలివి లేని వ్యక్తి ఓట్లు అడుగే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు.ఎందరో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య దేశంగా వెలసిన భారతదేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని దేశ విచ్చిన్నకారులను ఓడగొట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సతిష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !