+91 99635 77856

జమ్మికుంటలో…గులాబీ దళపతి కెసిఆర్ రోడ్ షో

-రోడ్ షో కి సర్వం సన్నద్ధం…
-గులాబీ మయమైన జమ్మికుంట…

హుజురాబాద్/మే02(మాఅక్షరం న్యూస్): గులాబీ దళపతి కేసీఆర్ గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర జమ్మికుంటకు రానున్నారు. కెసిఆర్ రోడ్ షో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జరగనుంది. సాయంత్రం 6 గంటలకు బస్సు యాత్ర జమ్మికుంటకు చేరుకుంటుంది. రోడ్ షో అనంతరం కెసిఆర్ వీణవంకలోని యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. కెసిఆర్ రోడ్ షో ను పురస్కరించుకొని జమ్మికుంటలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మికుంట గులాబీ మయమైంది. విద్యుత్ దీపాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో జమ్మికుంటను నింపేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చే వాహనాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ గ్రామం నుండి డప్పు చప్పులతో నృత్యాలతో ఉత్సాహంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ అన్ని తానై.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం జరిగే మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో.. రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. రైతులకు సాగునీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ 6గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలు చేస్తోందని,తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంటకు వస్తున్న కెసిఆర్ కు ఘన స్వాగతం పలకాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని అన్నారు. కెసిఆర్ రోడ్ షో కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు,పార్టీ శ్రేణులు హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !