+91 99635 77856

సత్తా చాటిన కౌశిక్…

-ప్రత్యర్థులకు దడ పుట్టించిన గులాబీ ఆత్మీయ సమ్మేళనం…
-కౌశిక్ జోరుకు గులాబీ బాస్ కేసీఆర్ ఫిదా…
హుజరాబాద్/మే06(మాఅక్షరం): హుజురాబాద్ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం జరిగిన, మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కెసిఆర్ హాజరైన నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రత్యర్థి పార్టీలకు దడ పుట్టించారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కెసిఆర్ వీణవంకకు చేరుకోగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా చీమలదండులా జనం తరలివచ్చారు. ప్రజల నుండి వచ్చిన స్పందన, కౌశిక్ రెడ్డి కి జనం,యూత్ లో ఉన్న ఫాలోయింగ్, కౌశిక్ జోరు చూసిన కెసిఆర్ ఇక్కడి అభిమానానికి ఫిదా అయిపోయారు. సభ అనంతరం జరిగిన ర్యాలీ హోరెత్తుతూ సాగింది. డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, బోనాలు.. ఆటపాటలతో హోరెత్తించారు. కెసిఆర్ పర్యటన విజయవంతం చేయడం ద్వారా.. తన శక్తి సామర్థ్యాలను కౌశిక్ మరోసారి చాటారు. కెసిఆర్ స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంట్లో రాత్రి బస చేసి.. కౌశిక్ కు మంచి భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలను ఇచ్చారు. కెసిఆర్ టూర్ సక్సెస్ కావడానికి కౌశిక్ “వన్ మెన్ ఆర్మీ”లా.. “అతడే ఒక సైన్యం”లా పనిచేశారు. సభకు ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేశారు. వేసవి అయినందున మహిళలకు ఇబ్బంది పడకుండా కూలర్లు సైతం ఏర్పాటు చేశారు. కెసిఆర్ పై పూల వర్షం కురిపిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

కౌశిక్ పై ప్రశంసల జల్లు…

కౌశిక్ ఎంత పొడుగు ఉన్నాడో అంత పెద్దగా సభను నిర్వహించాడని కెసిఆర్ తన ప్రసంగంలో ప్రశంసించారు. ఆనాడు ఉప ఎన్నిక వస్తే.. గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చాను. గెల్లు తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి బాగా పనిచేశాడు.. గెల్లు పై ఎన్నో కేసులు ఉన్నాయి.. గెల్లు బాగా పోరాడి ఉప ఎన్నికల మంచి ఓట్లు తెచ్చుకున్నాడు.. ఎన్నికల్లో గెలుపుకూటములు సహజం.. కానీ ప్రజలతో ఎప్పుడు మమేకమై పనిచేయాలి.. కౌశిక్ ఆనాడు టికెట్ అడిగాడు.. నీలాంటి వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. భవిష్యత్తు మీదే.. మీరు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కావాలని చెప్పాను.. నా మాట విన్నాడు.. ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేశాడు.. నేను ఇచ్చిన మాట ప్రకారం అతనికి ఎమ్మెల్సీ తో పాటు మండలి విప్ పదవి ఇచ్చాను.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించారు.. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందాడు.. అని కెసిఆర్ ఉద్వేగంగా చెప్పారు. అర్థరాత్రి తాను వీణవంకకు వస్తే.. పెద్ద ఎత్తున ప్రజలు నాకు స్వాగతం చెప్పారు.. మంగళ హారతులు పట్టుకొని.. బొట్టు పెట్టారు.. ఇక్కడి మహిళలు పెట్టిన బొట్టు తుడుచుకోవడానికి.. ముఖం కడుక్కోవడానికి.. నాకు గంట సమయం పట్టింది.. మీకు నాపై ఎంతో అభిమానం ఉంది.. ఇప్పుడు నేను జగిత్యాలకు వెళ్లాలి.. నన్ను మాత్రం ఆపొద్దు.. మరోసారి నేను వీణవంకకు వస్తాను.. ఇక్కడే 24 గంటలు ఉంటాను.. అప్పుడు మళ్లీ అందరిని కలుస్తాను.. అందరికీ ఫోటో దిగే అవకాశం ఇస్తాను.. అని కెసిఆర్ పేర్కొన్నారు. కౌశిక్ నాపై బాగా సాగిస్తాడు.. ఇక్కడికి రావాల్సిందేనని పట్టుపట్టాడు.. అని కౌశిక్ కుతనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కెసిఆర్ తెలిపారు. తనకు కౌశిక్ కొడుకు లాంటివాడని కెసిఆర్ పేర్కొన్నప్పుడు ప్రజలు హర్షద్వనాలు చేశారు. వేదిక పైకి కెసిఆర్ రావడంతో… కౌశిక్ వేదికపై ఈల వేస్తూ యువతలో ఉత్సాహం నింపారు. ఏది ఏమైనా వీణవంక లో జరిగిన కేసీఆర్ పర్యటన, గులాబీ పార్టీ ఆత్మీయ సభ విజయవంతం చేసిన యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మరోసారి రాజకీయంగా తన ప్రాబల్యాన్ని చాటడంతో పాటు.. ప్రజల్లో తనకున్న క్రేజీని.. నమ్మకాన్ని.. విశ్వాసాన్ని.. మరోసారి ప్రదర్శించారు. గులాబీ సభ సక్సెస్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !