-కాంగ్రెస్ బిజెపిలకు ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు గట్టి సమాధానం చెప్పాలి…
బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం…
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/మే 07(మాఅక్షరం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటలను గాలికి వదిలేసి కొత్త రాగం ఎత్తుకున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హుజురాబాద్ మండలంలోని సిర్సాపల్లి, చెల్పూర్ ఉపాధి హామీ కూలీలతో పాటు రైతులతో మాట్లాడుతూ…. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఆగస్టు 15 లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసిందన్నారు.తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆదమరచి ఉంటే మరోసారి తెలంగాణలో ఆంధ్రాలో కలిపే ప్రమాదం కూడా ఉందన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళేలా పార్లమెంట్లో వినోద్ కుమార్ గట్టిగా మాట్లాడతారని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న బిజెపిలు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసింది అని,పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తుందన్నారు.ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపిలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత పరిస్థితిని రైతులతో ఉపాధి హామీ కూలీలను అడిగి తెలుసుకున్నారు.వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.











