+91 99635 77856

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న డీఈవో, ఎంఈఓపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు…

-తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి…
హుజరాబాద్/ జూన్ 24(మా అక్షరం): హుజరాబాద్ లోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇష్టం సారంగా వ్యవహరిస్తున్నారని సంబంధించిన విద్యాశాఖ కరీంనగర్ డీఈవో, హుజురాబాద్ ఎంఈఓ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని శ్రీధర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్య హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఎన్ సి ఆర్ టి నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల నడిపిస్తున్నారని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు..ఇంత జరుగుతున్న కూడ సంబంధించిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ ప్రవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారన్నారు. నర్సరీ చదివే విద్యార్థుల నోట్ బుక్స్ కు 3000 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాలలకు అనుమతులు లేకుండా పాఠశాల నడిపిస్తున్న కూడా పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అనుమతి లేని పాఠశాలలు పేర్లు పత్రికా ముఖంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !