+91 99635 77856

హైదరాబాద్ స్టైల్ లో హుజురాబాద్ లో కిడ్నాప్ కు యత్నం..

కుడికాల సాయి, (మా అక్షరం ప్రతినిధి): హుజురాబాద్/ జూన్ 27(మాఅక్షరం):హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని చేపల మార్కెట్ వద్ద ఓ యువకుడిని అందరూ చూస్తుండగా ముగ్గురు యువకులు కలిసి కారులో హైదరాబాద్ స్టైల్ లో హుజురాబాద్ లో కిడ్నాప్ చేయడానికి యత్నించడం పట్టణంలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సతీష్ తన భార్య కనిపించకపోవడంతో నెల రోజులకు పైగా వెతుకుతుండగా హుజురాబాద్ లో ఓ వ్యక్తితో కలిసి ఉంటుందని తెలియడంతో తన స్నేహితులతో కలిసి కారులో హుజురాబాద్ వచ్చారు. గురువారం ఉదయం చాపల మార్కెట్ వద్ద ధనుష్ అనే వ్యక్తి తన భార్యతో కనబడడంతో అతనిని కారులో ఎక్కించుకొని కరీంనగర్ వైపు వెళ్లారు. అన్నపూర్ణ చౌరస్తా నుండి పట్టణ శివారు వరకు వెళ్లగా అప్పటికే అతన్ని కిడ్నాప్ చేస్తుండగా చూసిన పలువురు ఈ విషయం పోలీసులకు సమాచారం తెలియజేశారు. దీంతో పలువురు కిడ్నాప్ కు పాల్పడిన కారును అడ్డగించి కొంత దూరం వెళ్ళాక పట్టుకున్నారు. హుజురాబాద్ పోలీసులు కిడ్నాప్ చేసిన, కిడ్నాప్ కు గురైన వారిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు ఉండగా తన భార్య సదరు వ్యక్తితో లేచిపోయి హుజురాబాద్లో సహజీవనం చేస్తుందని తన భార్యను తనతో పంపాలని బాధితులు పోలీసులను వేడుకోగా ఇరువురితో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ రాత్రి వరకు కొలిక్కి రాకపోవడంతో తిరిగి మరుసటి రోజు నచ్చజెప్పి ప్రయత్నించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు తిరిగి వెళ్లారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !