+91 99635 77856

వాకర్స్ సౌకర్యార్థం ట్రాక్ ఏర్పాటు హామీ

-హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్…
హుజురాబాద్/ జూలై 05 (మా అక్షరం): పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ లో ప్రతినిత్యం వందలాదిమంది ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం హై స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు వాకర్స్ గ్రౌండ్ సంబంధించిన సమస్యలను ప్రణవ్ కు వివరించారు. డ్రైనేజీ తో పాటు ట్రాక్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ప్రణవ్ సౌకర్యార్థం ట్రాక్ ని ఏర్పాటు చేస్తామని డ్రైనేజీ తో పాటు వీధి దీపాలు ఏర్పాట్లు కు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సోల్లు బాబు, కొలిపాక శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, ఖాజీపేట శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, మిడిదొడ్డి శ్రీనివాస్, సొల్లు థశరథం, తాళ్ళపెల్లి రమేష్, ప్రతాప్ నాగరాజు, కందుల సందీప్, సదానందం, కె.ఆర్, మండ సాయి, గణేష్, రమేష్, రాఘవేంద్ర, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !