కరీంనగర్/ జులై 12 (మా అక్షరం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ముస్లిం యువతి మతాంతర వివాహం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు యువతీకి తెలియకుండానే అబార్షన్ చేయించిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. తనకు తెలియకుండానే తన బంధువులు హుజరాబాద్ లోని మాధవి నర్సింగ్ హోమ్ లో అబార్షన్ చేయించారని సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న హుస్నాబాద్ పోలీసులు హుజరాబాద్ లోని మాధవి నర్సింగ్ హోమ్ నిర్వాహకుడుతో పాటుగా సహకరించిన పి ఆర్ డి సత్యనారాయణ సిబ్బంది రజితను అరెస్టు చేసి జైలుకు పంపించడం విధితమే..ఈ అబార్షన్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా చేయడం సాధ్యం కాదు..అది తెలిసి కూడా డాక్టర్ ను తప్పించి మిగతా వారిని అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తుంది.డాక్టర్ లేకుండా సిబ్బంది గాని ఆర్ఎంపి వైద్యుడు గాని ఎలాంటి వైద్యం చేసే ఆస్కారం లేదు అయినప్పటికీ వారి ఇరువురిని అరెస్టు చేసి డాక్టర్ ను కేసు నుండి తప్పించడం పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో పసికందు మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇదే తరహాలో కేరళ స్కూల్ సమీపంలోని కాలువలో కూడా మృత శిశువు లభ్యమైనప్పటికీ నేటి వరకు భ్రూణ హత్యల సూత్ర, పాత్రధారులు ఎవరో తెలియక ముందే నిన్న మొన్న బస్టాండ్ సమీపంలో జరిగిన పసికందు మరణం పై విచారణ జరుగుతుండగానే మరో భ్రూణ హత్య జరగడం చర్చని అంశంగా మారింది. వరుస భ్రూణ హత్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత వైద్యాధికారులు వెంటనే స్పందించి భ్రూణ హత్యలను ప్రోత్సహిస్తున్న ఆసుపత్రులతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.











