–ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్…
– కాసుల వర్షం లో హుజురాబాద్, జమ్మికుంట ప్రయివేట్ హాస్పిటల్స్…
హుజురాబాద్/ జూలై 12(మా అక్షరం): నియోజకవర్గం లోని హుజురాబాద్, జమ్మికుంట జంట పట్టణాలలో ప్రైవేటు హాస్పిటల్లో కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్పత్రికి వెళితే లింగ నిర్ధారణ పరీక్షల కోసం కొన్ని ప్రైవేటు క్లినిక్లకు పంపిస్తున్నారు. దాని ద్వారా చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఆడపిల్ల అయితే అబార్షన్ చేసి వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. గత కొన్ని రోజుల క్రితం స్థానిక బస్టాండ్ లో పుట్టిన పసికందును మురికి కాలువలో పడేసిన దుర్ఘటన మరువకముందే పట్టణం లోని మాధవి నర్సింగ్ హోమ్ లో ఓ వివాహిత కు తనకు తెలియకుండానే అబార్షన్ చేసిన ఘటనను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ప్రైవేటు హాస్పటల్లో 50 వేల నుండి 70 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారని వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులతో వైద్య ఉన్నత అధికారులకు డబ్బులు ఇస్తూ నడిపిస్తూ చెలగాటమాడుతున్నారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రైవేటు హాస్పిటల్ పై గట్టి నిఘా పెట్టాలని గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు సైతం ప్రైవేటు క్లినిక్ లకు అనుసంధానంగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి ఈ అఘాత్యాల కు పాల్పడుతున్నారని, దీనిపై కలెక్టర్, డీఎం హెచ్వో స్పందించి మాధవి నర్సింగ్ హోమ్ ని తక్షణమే సీజ్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ డిమాండు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారపు రాంచెంద్ర మాదిగ, జాతీయ నాయకులు మారాపెల్లి శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర ఎం ఎస్ పి నాయకులు తునికి వసంత్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు దేవునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు











