+91 99635 77856

హుజురాబాద్ లో పిచ్చి కుక్కల స్వైర విహారం

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ లో పిచ్చి కుక్కల స్వైర విహారం

-పిచ్చి కుక్కల దాడిలో 30 మందికి పైగా గాయాలు..
-ఒకరి పరిస్థితి విషమం.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు...
హుజురాబాద్/ జూలై 18(మా అక్షరం): పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి 30 మందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. బుధవారం రాత్రి మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామంలో, పట్టణంలోని ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీనగర్, పద్మనగర్, విద్య నగర్, ఏకలవ్యనగర్ లలో 30 మందిని పిచ్చి కుక్కలు సాయంత్రం నుండి రాత్రి వరకు కరువగా పలువురికి గాయాలు అయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇటీవలనే బల్దియా అధికారులు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా కుక్కలను పట్టే వారిని తీసుకువచ్చి సుమారు ఐదు రోజులపాటు 500 కుక్కలను పట్టి అడవి ప్రాంతానికి తరలించి వదిలేశారు. ఒక్కొక్క కుక్కకు బల్దియా 300 నుండి 500 వరకు వారికి చెల్లించగా ఇక వీధి కుక్కలు లేవు అనుకుంటున్న తరుణంలో ఒకేరోజు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో వెరీ కుక్కలు స్వైర విహారం.. చేసి కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేసి కరవడంతో గాయాలకు గురై ఆస్పత్రి బాట పట్టారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఇంతమంది ఒకేసారి రావడంతో సరిపడా కుక్క కాటుకు వేసే రాబిపూర్ ఇంజక్షన్లు లేక పలువురు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందారు. ఒకరిని మాత్రం వరంగల్ ఎంజీఎం కు పంపడంతో అక్కడ కోలుకుంటున్నారు. బల్దియా అధికారులు పట్టణంలో పూర్తిస్థాయిలో వీధి కుక్కలు, వెర్రి కుక్కల భారి నుండి ప్రజలను రక్షించాలని పలువురు కోరుతున్నారు. కాగా పిచ్చికుక్క జమ్మికుంటలో పలువురిని కరిచి హుజురాబాద్ కు వచ్చి ఇక్కడ 30 మందికి పైగా కరిచి ఇక్కడి నుండి సైదాపూర్ మండలం చింతలపల్లికి వెళ్లి అక్కడ ఇద్దరినీ కరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, విద్యానగర్, బోర్నపల్లి మున్సిపల్ సిబ్బంది కొన్ని పిచ్చి కుక్కలను బంధించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ ఒక ప్రకటనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

-పిచ్చి కుక్కల దాడిలో 30 మందికి పైగా గాయాలు..
-ఒకరి పరిస్థితి విషమం.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !