+91 99635 77856

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన సబ్బని వెంకట్

-ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు పునరావసం కల్పించాలి…
-నష్టపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి..
హుజురాబాద్/జూలై18 (మా అక్షరం): పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా సమీపంలో చిరు వ్యాపారస్తులకు చెందిన అనేక పండ్ల దుకాణాలు… మెకానిక్ షాపులు… కొబ్బరి బొండాల దుకాణం… చెప్పుల షాపు వంటి వివిధ రకాల షెడ్లు సోమవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతి అయిన విషయం విధితమే.. విషయం తెలియగానే మరుక్షణమే ప్రముఖ సామాజికవేత్త… జెన్ ఫ్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్… ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి సబ్బని వెంకట్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడమే కాకుండా గురువారం ఉదయం హుజరాబాద్ కు వచ్చి బాధితులను స్వయంగా కలుసుకున్న వెంకట్ ఒక్కొక్కరికి 5000 రూపాయల నగదు పరిహారాన్ని సహాయాన్ని అందించడం జరిగింది.అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులందరూ తమకు దేవుడిలా ఆర్థిక రూపేనా ఆదుకున్న సబ్బని వెంకట్ కు కృతజ్ఞతలు తెలిపారు.మొత్తం 31 మంది బాధితులు ఉండగా… ఒక్కొక్కరికి 5000 చొప్పున 1,55 వేల రూపాయలను వెంకట్ వ్యక్తిగతంగా అందించి పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో బాధితులతో పాటు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి వెంకట్ మాట్లాడుతూ… ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగి పేదలు రోడ్డున పడిన సందర్భాలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చేతనైనంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని… ఎప్పటి మాదిరిగా బాధితులు తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు పునారావాస చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సబ్బని వెంకట్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య, టి ఆర్ పి ఎస్ జిల్లా కోకన్వీనర్ చిలకమారి శ్రీనివాస్,హుజురాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, రజక సంఘం నాయకులు కొలిపాక శంకర్, సబ్బని వెంకట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !