+91 99635 77856

శభాష్ మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు..

Kudikala Sai Editor
maaksharamnews.in

శభాష్ మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు..

-పిచ్చికుక్క దాడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో కీలక పాత్ర..
-కుక్కను హతమార్చే వరకు రెక్కీ
పలువురి ప్రశంసలు..

హుజురాబాద్/ జులై 18 (మా అక్షరం): జమ్మికుంట నుంచి ఓ పిచ్చికుక్క దొరికిన వారిని దొరికినట్టు కరుస్తూ హుజురాబాద్ లోకి వచ్చింది. హుజురాబాద్ లోకి చొరబడ్డ పిచ్చికుక్క నిమిషాల వ్యవధిలోనే సుమారు 50 మందిని కరిచింది. విషయం తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపల్ అధికారులతో పాటు కౌన్సిలర్లు బుధవారం సాయంత్రం కుక్క బారి నుండి ప్రజలను కాపాడేందుకు తమ వంతు కర్తవ్యం నిర్వహించారు.స్థానిక బీ ఆర్ ఎస్ నేతలు మొలుగు పూర్ణచందర్, ముక్క రమేష్ రాత్రంగా ద్విచక్రవాహనాలపై కట్టెలు పట్టుకుని తిరిగారు. కుక్క దాడిలో మరింత మంది బాధితులు కాకుండా అనుక్షణం వార్డులలో తిరుగుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పిచ్చికుక్క ఆచూకీ కోసం రాత్రంతా రేక్కి నిర్వహించారు.ఎట్టకేలకు గురువారం వేకువజామునే కనిపించింది. మున్సిపాలిటీ సూపర్వైజర్ ప్రతాప రాజు, రమేష్, కుమార్, తెగించి కుక్కను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ రమేష్ కడుపుపై కరిచింది. మున్సిపల్ సానిటరీ సూపర్వైజర్ కిషన్ రావు గారు.. సిబ్బందిని అప్రమత్తం చేసి.. కుక్క బారి నుండి ప్రజలను కాపాడేందుకు కృషి చేసారు.. చివరికి కుక్కను సిబ్బంది, ప్రజల సహాయంతో మట్టుబెట్టారు. ఈ విషయంలో సహకరించిన మున్సిపల్ కార్యవర్గానికి, అధికారులకు, సిబ్బందికి ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

పిచ్చికుక్క దాడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో కీలక పాత్ర..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !