– రుణమాఫీ రాష్ట్ర,దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం..
– ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి సిఎం రేవంత్ రెడ్డి మాత్రమే దక్కుతుంది..
– ఆదర్శ రైతుతో ప్రణవ్ బైక్ ర్యాలీ ద్వారా రైతు వేదికకు చేరిక…
– మాట ఇచ్చామంటే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ…
– గతంలో వైఎస్ఆర్,ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ…
– పంద్రాగస్టు వరకు 2 లక్షల పూర్తి రుణమాఫీ చేసి తీరుతాం…
– హుజురాబాద్ రైతుల,కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు…
– రుణమాఫీ ప్రారంభం కాగానే చిరుజల్లులతో దీవించిన వరుణుడు…
– వదంతులు ప్రతిపక్షాల కుట్ర,రుణమాఫీ అర్హులైన అందరికీ చేస్తాం…
-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వొడితల ప్రణవ్ ..
హుజురాబాద్/ జూలై 18(మా అక్షరం): వ్యవసాయం దండుగా అన్న నానుడు నుంచి వ్యవసాయం,వ్యవసాయం చేసే రైతు బాగుపడాలని ఆలోచించే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అని,రైతుల కళ్ళల్లో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.రైతులకు రుణమాఫీ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే ఆదర్శ రైతుని స్వయంగా ప్రణవ్ బైక్ పై వెంటబెట్టుకుని,100 మంది రైతులతో భారీ బైక్ ర్యాలీగా రైతు వేదికకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.లక్ష లోపు ఉన్న రైతుల రుణాలను రుణమాఫీ కోసం ప్రభుత్వం 7 వేల కోట్లను రైతుల అకౌంట్లో జమ చేసిందని తెలిపారు.అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుతూ బాణాసంచా కాల్చి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.రాబోయే రోజుల్లో రైతు ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని అన్నారు.దేశ,రాష్ట్ర చరిత్రలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏకకాలంలో 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నామని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ జరుగుతుంది అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ప్రభుత్వాలూ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చగా రుణమాఫీ పేరుతో కాలయాపన చేసి పూర్తిగా రుణమాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పించుకున్నారని కానీ రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే చెప్పిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారని,రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఆగస్టు 15 లోపు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నమని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరికీ చేస్తామని అన్నారు.గత ప్రభుత్వాలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన అవన్నింటినీ అధిగమించి 7 నెలల్లో రైతులకు ఇచ్చిన మాట తప్పవద్దనే ఉద్దేశం కొద్దీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇటు రైతుల సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుందని అన్నారు.ఇప్పటికే ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని రుణమాఫీ ద్వారా ప్రజలకు మరింత చేరువైతామని అన్నారు.లక్ష వరకు ఉన్న రుణాలను గురువారం రోజు సాయంత్రం వరకు వారి అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం వేస్తుందని,రెండవ విడుతలో లక్ష 50 వేల ఉన్న వరకు రుణాలను ఈ నెలాఖరు వరకు మాఫీ చేస్తామని,పంద్రాగస్టు వరకు రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు.రుణమాఫీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకు వెళ్లి అక్కడ తమ యొక్క సమస్యను పరిష్కారం చేసుకొనటానికి నోడల్ ఆఫీసర్ ఉంటాడని అక్కడ తమ యొక్క సమస్యను తీర్చుకోవాలని సూచించారు.రుణమాఫీ విషయంలో రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు.











