+91 99635 77856

ముగ్గురు అధికారులు ఒకేరోజు పదవి బాధ్యతలు స్వీకరణ..

హుజురాబాద్/ఆగస్టు02(మా అక్షరం): ముగ్గురు అధికారులు ఒకేరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం యాదృచ్ఛికంగా జరిగింది. శుక్రవారం మంచి శుభ సూచికంగా ముగ్గురు స్థానిక మండల స్థాయి అధికారులు… వీరు పలు కీలకమైన శాఖలకు ఉన్నత అధికారులుగా వ్యవహరించడం జరుగుతుంది… అలాంటి వ్యక్తులు ఒకేరోజు బాధ్యత తీసుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది. కాబట్టి హుజురాబాద్ మండల పరిధిలో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకనగా ఏకకాలంలో ముగ్గురు ఉన్నతాధికారులు బదిలీపై వచ్చి హుజరాబాద్ లో ఒకేరోజు బాధ్యతలు తీసుకోవడం ఏమిటని పలువురు చర్చించుకోవడం గమనార్థకం..ఇందులో ఒకరు తాసిల్దార్, మరొకరు టౌన్ సిఐ, ఇంకొకరు సబ్ రిజిస్టార్…

–హుజురాబాద్ తాసిల్దారుగా కనకయ్య..

హుజురాబాద్ మండల తాసిల్దారుగా
కే.కనకయ్య శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ తాసిల్దార్ గా ఉన్న కే.విజయ్ కుమార్ తిమ్మాపూర్ కు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న కనకయ్య హుజురాబాద్ కు వచ్చారు.

–హుజురాబాద్ సిఐగా తిరుమల్ ..

హుజురాబాద్ టౌన్ సిఐగా జి తిరుమల్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ టౌన్ సిఐగా పనిచేసిన బొల్లం రమేష్ కరీంనగర్ సిసిఎస్ కు బదిలీ కాగా కరీంనగర్ సిఎస్ బి త్రీ లో పనిచేస్తున్న తిరుమల్ హుజురాబాద్ కు బదిలీపై వచ్చారు.

–సబ్ రిజిస్టర్ గా ఇంతియాజుద్దీన్..

హుజురాబాద్ సబ్ రిజిస్టర్ గా ఎండీ ఇంతియాజుద్దీన్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఇంతకాలం హుజురాబాద్ లో పని చేసిన ఎండీ మక్సూద్ అలీ అదిలాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో ఇంతియాజుద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !