+91 99635 77856

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది మృతి..

హుజురాబాద్/ ఆగస్టు04(మా అక్షరం): పట్టణంలోని సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ న్యాయవాది బాణాల శ్యాంసుందర్ (60) గుండెపోటుతో ఆదివారం ఉదయం మరణించారు. ఆయన స్వస్థలం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం. గత కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్ లో నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో గత 15 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. బాణాల శ్యాంసుందర్ మృత దేహాన్ని జర్నలిస్టులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.

జర్నలిస్ట్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం..

గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో ఉన్న శ్యాంసుందర్ మృతి సందర్భంగా జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు, ఆంధ్రప్రభ ,సూర్య, న్యాయపోరాటం పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం న్యాయపోరాటం దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు. శ్యాంసుందర్ మృత దేహాన్ని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి సమాజానికి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రతినిత్యం పేద ప్రజల, బడుగు ,బలహీన వర్గాల పక్షాన నిలబడి ఎన్నో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఆయన మృతి జర్నలిజం,న్యాయవాద రంగానికి తీరని లోటని వారన్నారు. నివాళులు ఆర్పించిన వారిలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ కాయిత రాములు, జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్,తిరునగరి ఆంజనేయస్వామి,పరాంకుశం కిరణ్ కుమార్, కేసిరెడ్డి నరసింహారెడ్డి,గడ్డం హర్షవర్ధన్,వేల్పుల సునీల్ కుమార్, పోతారాజ్ సంపత్,కుడికాల సాయి, జిల్లా యూనియన్ నాయకులు మహేంద్ర చారి, సదానందం ,కాల్వ కృష్ణ, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు ,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !