-నిర్వహించిన ఎల్కతుర్తి కమిటీ సభ్యులు..
ఎల్కతుర్తి/ఆగస్టు 27(మా అక్షరం): మండలంలోని వల్బాపూర్ గ్రామములో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ భగవాన్ ఊరేగింపు కార్యక్రమంలో గోకులాష్టమి రోజున దిగ్విజయం గా జరిగింది.ఆగస్టు 26 సోమవారం రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణుడిని కొలువు తీర్చి నిత్య పూజలు చేశారు. రెండవ రోజు ఆగస్టు 27 మంగళవారం రోజున గోకులాష్టమి రోజున ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎంపీడీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం కృష్ణ ప్రతిమ కొలువు పశుపతినాథ్ స్వామి దేవస్థానం నుండి వల్బాపూర్,బస్టాండు గ్రామపంచాయతీ రోడ్, కొత్తవాడ,తెనుగువాడ, హనుమాన్ టెంపుల్ నుండి వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు పురవీధుల నుండి కోలాట నృత్యాలతో జరిపారు..కార్యక్రమంలో త్రైత సిద్దాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షుడు, సభ్యులు సదా నిరంజన్ సిద్ధాంతి శివఆలయ కమిటీ చైర్మన్ గంజి భవనాలుషి , శ్రీనివాసరావు, రవీందర్రావు, అనంత రాములు ,వెంకట్రావు లక్ష్మణరావు ,చక్రపాణి, రవీందర్ రెడ్డి, సతీష్ చారి, బాలు గోపికృష్ణ, కుమారస్వామి శివ, నారాయణ సింగ్ ,వెంకట్, క్షేత్రజ్ఞ రుషి, సాకేత్, తనుషా, దివిజ, స్రవంతి రాణి రేవతి సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.











