+91 99635 77856

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి… జీవితాలు కాపాడుకోండి…

Kudikala Sai Editor
maaksharamnews.in

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి… జీవితాలు కాపాడుకోండి…

హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ...
హుజురాబాద్/ఆగస్టు27(మా అక్షరం): వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ జీవితాలను కాపాడుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. మంగళవారం హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు... వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. ఎంతోమంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదాల్లో మరణించారని అన్నారు.అలాగే నెంబర్ ప్లేట్ ప్రతి వాహనానికి ఉండాలని లేకపోతే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు వాహనంకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వాహనం వెంటే ఉంచుకోవాలన్నారు.18 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితిలోనూ వాహనం నడపరాదని అన్నారు.తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ వాహనం నడిపిన భారీ జరిమానా తో పాటు శిక్ష తప్పదని హెచ్చరించారు.సెల్ ఫోన్లో మాట్లాడుతూ కూడా చాలామంది వాహనాలు నడుపుతున్నారని అలా చేయకూడదని ఎంత ముఖ్యమైన విషయం అయినప్పటికీ ప్రాణాలు కంటే ముఖ్యం కాదని అన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అన్నారు. తాగి వాహనం నడిపి ప్రమాదం జరిగితే తనతోపాటు తన కుటుంబాన్ని కూడా తీరని అన్యాయం జరుగుతుందని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై షేక్ యూనస్, DDమహమ్మద్ అలీ, పోలీస్ సిబ్బందితోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ…
హుజురాబాద్/ఆగస్టు27(మా అక్షరం): వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ జీవితాలను కాపాడుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. మంగళవారం హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు… వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. ఎంతోమంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదాల్లో మరణించారని అన్నారు.అలాగే నెంబర్ ప్లేట్ ప్రతి వాహనానికి ఉండాలని లేకపోతే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు వాహనంకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వాహనం వెంటే ఉంచుకోవాలన్నారు.18 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితిలోనూ వాహనం నడపరాదని అన్నారు.తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ వాహనం నడిపిన భారీ జరిమానా తో పాటు శిక్ష తప్పదని హెచ్చరించారు.సెల్ ఫోన్లో మాట్లాడుతూ కూడా చాలామంది వాహనాలు నడుపుతున్నారని అలా చేయకూడదని ఎంత ముఖ్యమైన విషయం అయినప్పటికీ ప్రాణాలు కంటే ముఖ్యం కాదని అన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అన్నారు. తాగి వాహనం నడిపి ప్రమాదం జరిగితే తనతోపాటు తన కుటుంబాన్ని కూడా తీరని అన్యాయం జరుగుతుందని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై షేక్ యూనస్, DDమహమ్మద్ అలీ, పోలీస్ సిబ్బందితోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !