హుజురాబాద్/ఆగస్టు28(మా అక్షరం): హుజురాబాద్ పట్టణంలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. హుజురాబాద్ పట్టణంలో అర్ధరాత్రి ఆకతాయిలు వాహనాలపై రేసు పోటీలకు పాల్పడుతుండగా, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు చేశారు. హుజురాబాద్ బస్టాండ్, మరియు లాడ్జిలను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించారు. పట్టణంలో అర్ధరాత్రి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులున్నారు జాగ్రత్త అనే సంకేతాలు ఇచ్చారు. గతంలో ఉన్న ఏ పోలీసులు కూడా అర్ధరాత్రి తనిఖీలు చేసేవారు కాదు కానీ ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ చేపట్టడంతో పట్టణ ప్రజల్లో అంతకుముందు ఉన్న అభద్రత భావం తొలగినట్లు అయింది. ఈ తనిఖీల్లో హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ యూనస్ అహ్మద్ అలీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.











