+91 99635 77856

పి.హెచ్.డి డాక్టరేట్ పొందిన పరమేష్ కు సన్మానం..

Kudikala Sai Editor
maaksharamnews.in

పి.హెచ్.డి డాక్టరేట్ పొందిన పరమేష్ కు సన్మానం..

హుజురాబాద్/సెప్టెంబర్ 07(మా అక్షరం): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేష్ కు ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి డాక్టరేట్ లభించిన సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సందమల్ల నరేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఉస్మానియాలో పి.హెచ్.డి పరిశోధక విద్యార్థిగా చేరి మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల వాటిపై ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు, ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికి గొడిశాల పరమేష్ పి.హెచ్.డి పట్టా పొందడం అభినందనీయమని తెలిపారు. 2004 వ సంవత్సరంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొంది ఇప్పుడు అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి జంతుశాస్త్ర విభాగం లో పి.హెచ్.డి పట్టా అందుకోవడం సంతోషకర విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు జంగ అనిల్,చల్లూరి విష్ణువర్థన్,తుమ్మనపల్లి గ్రామానికి చెందిన రమేష్ గౌడ్, రాజు, అశోక్, శ్రీనివాస్, గొడిశాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/సెప్టెంబర్ 07(మా అక్షరం): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న తుమ్మనపల్లి వాసి గొడిశాల పరమేష్ కు ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి డాక్టరేట్ లభించిన సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సందమల్ల నరేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే పరిశోధన పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఉస్మానియాలో పి.హెచ్.డి పరిశోధక విద్యార్థిగా చేరి మధ్యతరహా రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి పెంపుదల వాటిపై ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు, ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగనాయక సాగర్ మరియు మిడ్ మానేర్ డ్యాం అనే శీర్షికతో సీనియర్ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధన గ్రంథానికి గొడిశాల పరమేష్ పి.హెచ్.డి పట్టా పొందడం అభినందనీయమని తెలిపారు. 2004 వ సంవత్సరంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొంది ఇప్పుడు అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి జంతుశాస్త్ర విభాగం లో పి.హెచ్.డి పట్టా అందుకోవడం సంతోషకర విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు జంగ అనిల్,చల్లూరి విష్ణువర్థన్,తుమ్మనపల్లి గ్రామానికి చెందిన రమేష్ గౌడ్, రాజు, అశోక్, శ్రీనివాస్, గొడిశాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !