+91 99635 77856

పండుగ రోజు తీవ్ర విషాదం..

హుజురాబాద్/సెప్టెంబర్07(మా అక్షరం): మండలంలో సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి రోజు తీవ్ర విషాదం జరిగింది… పండుగ ఉత్సహంలో ఉన్న యువకుడు వినాయక మండపంలో లైట్ బిగిస్తుండగా కరెంట్ షాక్ కు గురై శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. సిర్సపల్లి గ్రామానికి చెందిన వంగ వెంకటేష్- లావణ్యలకు యశ్వంత్(17) ఏకైక కుమారుడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపంలో బల్బు బిగిస్తుండగా బల్బు పగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి గమనించి యశ్వంత్ ను వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే యశ్వంత్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పండుగ రోజే ఈ సంఘటన జరగడంతో సిర్సపల్లి గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !