+91 99635 77856

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వెలిచాల రాజేందర్ రావు

Kudikala Sai Editor
maaksharamnews.in

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వెలిచాల రాజేందర్ రావు

హుజురాబాద్/ సెప్టెంబర్07(మా అక్షరం): నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి రాజేందర్ రావు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్ ఎస్ యు ఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ అహర్నిశలు కృషి చేశారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ హై కమాండ్ పిసిసి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇందుకు బీసీ నేతకు బీసి అధ్యక్ష పదవి కట్టబెట్టడమే నిదర్శనమని తెలిపారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ సెప్టెంబర్07(మా అక్షరం): నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి రాజేందర్ రావు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్ ఎస్ యు ఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ అహర్నిశలు కృషి చేశారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ హై కమాండ్ పిసిసి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇందుకు బీసీ నేతకు బీసి అధ్యక్ష పదవి కట్టబెట్టడమే నిదర్శనమని తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !