-సంతాపం తెలిపిన ప్రెస్ క్లబ్ మిత్రులు…
ఎల్కతుర్తి/ సెప్టెంబరు 09(మా అక్షరం): మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన హింగే అశోక్ (51) గుండెపోటుతో సోమవారం వేకువ జామున మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు అశోక్ రెండు వారాల క్రితం గుండెపోటుకు గురయ్యాడు.దీంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ క్రమంలో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.గుండెకు మూడు ధమనులు అమర్చగా ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు చెప్పారు. కాగా ఆదివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వైద్యులు గంటల తరబడి అతని బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో అశోక్ ఊపిరి ఆగిపోయింది.అశోక్ చాలా ఏళ్లుగా పలు దినపత్రికల్లో ఎల్కతుర్తి మండల జన సముద్రం జర్నలిస్టుగా పనిచేశాడు.అశోక్ కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.గుండెపోటుకు గురై అశోక్ మరణించడాన్ని మండల ప్రజలు జీర్ణించు కోలేకపోయారు. అందరితో కలిసి మెలిసి ఉండి మంచి మనస్తత్వం కలిగిన అశోక్ మరణం తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాణాల దన్ రెడ్డి,పాలకవర్గ సభ్యులు కందుకూరి రాజన్న , శ్రీరామోజు సతీష్ చారి, వేణు, దుగ్యాల దేవేందర్ రావు, కొన్నే దేవేందర్ రెడ్డి, మహేష్, మహేందర్, బండి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు











