+91 99635 77856

మహిళలంతా చాకలి ఐలమ్మ ధైర్యాన్ని పునికి పుచ్చుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

మహిళలంతా చాకలి ఐలమ్మ ధైర్యాన్ని పునికి పుచ్చుకోవాలి

హుజురాబాద్/సెప్టెంబర్10(మా అక్షరం): నేటి సమాజంలో మహిళలంతా చాకలి ఐలమ్మ ధైర్యాన్ని పునికి పుచ్చుకోవాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి పురస్కరించుకొని హుజురాబాద్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రజాకార్లకు దీటుగా ఆమె పోరాట పటిమ గొప్పదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిందని కొనియాడారు. నాటి ఘడీల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణలోని ఎంతోమందిని ఉద్యమం వైపు నడిపించిందని అన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ, కేదాసి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,కొలిపాక శంకర్,సుంకరి,రాజమౌళి,కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్,నల్ల సుమన్, ఇమ్రాన్, కొండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !