+91 99635 77856

ప్రజాకవి కాళోజికి ఘన నివాళి…

ఎల్కతుర్తి/సెప్టెంబర్ 09(మా అక్షరం):
మండలంలోని వల్బాపూర్ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వల్భాపూర్ లో ప్రధానోపాధ్యాయులు బద్దం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాళోజీ నారాయణరావు తెలుగు భాష కు తెలంగాణ యాస కు ఎనలేని కృషి చేశారని, బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష గా తెలంగాణ యాస ను బతికించారన్నారు.ఒక జాతి పట్ల జరుగుతున్న వివక్షను, అన్యాయాన్ని ఎలుగెత్తిన స్వాభిమానిగా ఆయన్ని ప్రాంతాలకు అతీతంగా అభిమానించారని,జీవితాంతం ఉద్యమ కవిత్వాన్ని వినిపిస్తూ తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలిస్తూ,కవిగా అన్ని ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న విశ్వజనీన కవి కాళోజీ అని అన్నారు. పుట్టుక నీది చావు నీది జీవితమంతా దేశానిది అని ఎలుగెత్తి చాటి తన మరణం తరువాత తన పార్థివ శరీరాన్ని వైద్య కళాశాలకు ఇచ్చిన మహానుభావుడు అని అన్నారు.పరభాషాలను నేర్చుకోవటాన్ని కాళోజీ ఎప్పుడు వ్యతిరేకించాలే కానీ ఆ సాకుతో మాతృభాషను నిర్లక్ష్యం చేయటాన్ని మాత్రం సహించేవారు కాదన్నారు. నేటి తరం..తెలుగు పదాలనే మర్చిపోతోందని కాళోజీ ఆవేదన చెందే వారు. తేటతెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించే వారు. నాగొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై పోరాడిన ప్రజాకవిగా కీర్తి గాంచిన కవి కాళోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘురామ్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటస్వామి, పద్మలత,రాధిక, ప్రేమ్ ప్రసాద్ రావు మరియు ఏ ఏ పి సి చైర్మన్ నీరజ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !