-కన్నుల పండుగలా…శోభాయాత్రలు
హుజురాబాద్/ సెప్టెంబర్ 16(మా అక్షరం ):
జై గణేశా..జై జై గణేశా.. బై బై గణేశా … గణపతి బప్పామోర్యా.. నినాదాలు మిన్నంటగా యువకులనృత్యాలు, చిన్నారుల ఆటపాటలు, ఆడపడుచుల కోలాటాలు డప్పు చప్పుళ్ల నడుమ సోమవారం గణనాథుడికి వీడ్కోలు పలికారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్రకు ప్రజలు అడుగడుగునా గణపయ్యకు నీరా“జనం” పలికారు. తొమ్మిది రోజుల పాటు ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన గౌరిసుతుడిని గంగమ్మ ఒడికి చేర్చి..‘గణపయ్యా పోయిరావయ్యా…’ సాగనంపి వీడ్కోలు,పలికారు భక్త కోటి జనం… గణేష్ నవరాత్రోత్సాల్లో భాగంగా తొమ్మిది రాత్రులు ధూప దీప నైవేధ్యాలతో విశేష పూజలందుకున్న వినాయకుడు సోమవార గణనాథుని నిమజ్జనం ఘనంగా జరిగింది.యువతీ యువకుల నృత్యాలు, హహిళల కోలాటాలు, ఒగ్గు కాళకారుల విన్యాసాలు,చిన్నారుల కేరింతల నడుమ భక్త జనం గణపయ్య వెంట కదిలారు. ఉదయం నుండే గ్రామల్లో వినాయకుడి నిమజ్జన కోలాహలం మొదలైంది.
నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ ఏర్పాట్లు….
పట్టణ శివారులోని కొత్తపల్లి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లను నిర్వహించింది. భక్తులకు ఏలాంటి ఇబ్బందుకుల కలుగకుండా ముందుస్తుచర్యలు తీసుకున్నారు. విగ్రహా నిమజ్జనపు ప్రాంతాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఆరోగ్యశాఖ పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ నిర్మల, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య,ఏఈ సాంబరాజు, మేనేజర్ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు కళాకారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జనం ను కాకతీయ కాలువ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ గంధేరాధిక కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.











