+91 99635 77856

సనాతన సాంప్రదాయాలను కాపాడుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

సనాతన సాంప్రదాయాలను కాపాడుకోవాలి

-మాంటిస్సోరిలో ఘనంగా ఓనం వేడుకలు..
హుజురాబాద్/సెప్టెంబర్14(మా అక్షరం):సనాతన భారతీయ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మాంటిస్సోరి ప్రధానోపాధ్యాయురాలు గీతా షాజు అన్నారు. శనివారం పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓణం పండుగ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగని,మలయాళీ కాల గమనములో క్యాలెండర్ మొదటి నెల చింగం లో ఆగస్టు - సెప్టెంబర్ నెలలో వస్తుందని తెలిపారు.ఈ పండుగ రోజున మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి వస్తాడని కేరళ ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.కుల మతాలకు అతీతంగా ప్రజలు స్నేహభావంతో జరుపుకుంటారని తెలిపారు. ఓణం పండుగ సందర్భంగా పాఠశాలలో చక్కని పువ్వుల మాలలు, కైకొట్టికలి నృత్యములు, ఉపాధ్యాయుల కేరళ సాంప్రదాయ వస్త్రధారణ ఎంతగానో విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ షాజు థామస్,నూకల శ్రీనివాసరావు,గండ్ర సుధాకర్ రెడ్డి,డాక్టర్ సుధాకర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-మాంటిస్సోరిలో ఘనంగా ఓనం వేడుకలు..
హుజురాబాద్/సెప్టెంబర్14(మా అక్షరం):సనాతన భారతీయ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మాంటిస్సోరి ప్రధానోపాధ్యాయురాలు గీతా షాజు అన్నారు. శనివారం పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓణం పండుగ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగని,మలయాళీ కాల గమనములో క్యాలెండర్ మొదటి నెల చింగం లో ఆగస్టు – సెప్టెంబర్ నెలలో వస్తుందని తెలిపారు.ఈ పండుగ రోజున మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి వస్తాడని కేరళ ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.కుల మతాలకు అతీతంగా ప్రజలు స్నేహభావంతో జరుపుకుంటారని తెలిపారు. ఓణం పండుగ సందర్భంగా పాఠశాలలో చక్కని పువ్వుల మాలలు, కైకొట్టికలి నృత్యములు, ఉపాధ్యాయుల కేరళ సాంప్రదాయ వస్త్రధారణ ఎంతగానో విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ షాజు థామస్,నూకల శ్రీనివాసరావు,గండ్ర సుధాకర్ రెడ్డి,డాక్టర్ సుధాకర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !